Thursday, August 21, 2025

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకే అవకాశం?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మరోసారి ఓంబిర్లాకు లోక్‌సభ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి కాసేపట్లో ఓంబిర్లా నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఎన్‌డిఎ తరపున స్పీకర్ పదవికి ఓంబిర్లా నామినేషన్ వేయనున్నారు. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని ఓం బిర్లా కలిశారు. రాజస్థాన్‌లోని కోట నుంచి మూడోసారి ఓంబిర్లా ఎంపిగా ఎన్నికయ్యారు. 2019లో తొలిసారిగా లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎనికయ్యారు. ఇండియా కూటమి నేతలతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేకు రాజ్‌నాథ్ సింగ్ పోన్ చేశారు. స్పీకర్ పదవి ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని రాజ్‌నాథ్ వారిని కోరారు. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ విపక్షాలకు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News