సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ఈ జోనర్‌లో వచ్చే సినిమాలు మినిమమ్ గ్యారంటీగా సక్సెస్ సాధిస్తాయి. ఇప్పుడు ఈ జోనర్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లోకా ఛాప్టర్1: చంద్ర’ (Lokah Chapter 1). హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ సినిమాలో నస్లేన్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. భూతకాలం, ప్రస్తుత కాలాన్ని లింక్ చేసే సూపర్ పవర్స్ కలిగిన చంద్ర పాత్రలో కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది.
ట్రైలర్‌లో (Lokah Chapter 1) పోలీసులతో విబేధం, యాక్షన్ సీన్లు, థ్రిల్లింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించగా.. డామ్నిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బెజొయ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఓనమ్ పండుగ కానుకగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో మలయాళంతో పాటు ఇతర భాషల్లో సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నారు.
Also Read : వినాయక చవితి కానుకగా ‘ఓజీ’ రెండో పాట..