అమరావతి: భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల్లో జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు. మురళీ నాయక్ భౌతికకాయానికి మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ నివాళులర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను లోకేష్ ఓదార్చారు. జవాను భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి సెల్యూట్ చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లపై ఆర్మీ అధికారులతో మంత్రి లోకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కల్లితండాలో మురళీ నాయక్ భౌతిక కాయం ప్రజల సందర్శనార్థం ఇంటి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఉంచారు. వీరజవాను మురళీనాయక్ భౌతిక కాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, ఎంఎల్‌ఎలు నివాళులర్పించారు. కాసేపట్లో అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరుగనున్నాయి. పార్థివ దేహం వద్ద ఎంపి పార్థసారథి, ఎంఎల్‌ఎలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట ప్రసాద్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, తదితరలు నివాళుర్పించారు.
వీర జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన లోకేష్
- Advertisement -
- Advertisement -
- Advertisement -