- Advertisement -
అనకాపల్లి: జిల్లాలోని నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపు తప్పి మొదటి కౌంటర్ నుంచి రెండో కౌంటర్ మీదకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అక్కడి నుంచి పరుగు తీశారు. ఈ ఘటనలో ఎవరకీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే లారీ అదుపు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
- Advertisement -