Wednesday, July 9, 2025

లారీ భీభత్సం.. వెనుక నుంచి 2 కార్లు, ఒక బైకును ఢీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఇందల్వాయి పరిధిలోని చంద్రయాన్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న 2 కార్లు, ఒక బైకును లారీ ఢీకొట్టింది. నిజామాబాద్ (Nizamabad) నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఢీకొని జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలో ఒక కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనస్థలి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ బీభత్సం సృష్టించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News