- Advertisement -
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. లారీ మామిడికాయల లోడ్‌తో రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తింంచారు. ప్రమాద సమయంలో లారీ 30 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -