- Advertisement -
న్యూయార్క్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో పోలీసుల కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి మృతి చెందాడు. లాస్ ఏంజెల్స్ లోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన గుర్‌ప్రీత్ సింగ్ (36) అనే వ్యక్తి పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. గుర్‌ప్రీత్ సింగ్ కారులో ఫిగెరోవా స్ట్రీట్ లో ఒలింపిక్ బౌలేవార్డ్ కూడలికి చేరుకున్నాడు. అనంతరం కారును ఆపి చేతిలో కత్తితో వాహనదారులను బెదిరించసాగాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్‌ప్రీత్ సింగ్ హింసాత్మక చర్యలను గమనించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలించేలోపే అతను దుర్మరణం చెందాడని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సోషల్ వీడియో లో వైరల్ గా మారింది.
- Advertisement -