Monday, May 12, 2025

సెప్టెంబర్‌ 18న ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’..

- Advertisement -
- Advertisement -

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ ఫుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబర్‌ 18న వరల్డ్ వైడ్ గా ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ ను వదిలారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించనున్నారు. కాగా, ప్రదీప్ రంగనాథ.. ‘డ్యూడ్’ అనే మరో క్రేజీ మూవీని చేస్తున్నాడు. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News