భోపాల్: గాఢంగా ప్రేమించిన ప్రియుడి కోసం ఇంటి నుంచి పారిపోయిన ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమించిన యువకుడి కోసం యువతి ఇంట్లో నుంచి పారిపోయి ఇండోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్రేమికుడు కోసం వేచి చూసింది అతడు కనిపించలేదు. అతడు చివరలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ప్రియురాలుకు ఫోన్‌లో తెలిపాడు. దీంతో యువతి ఇంటికి వెళ్లలేక తీవ్ర మనోవేదనకు గురైంది.
Read Also: వామ్మో డిస్టల్ డిఫ్యూజ్ వ్యాధా… అటు చావనివ్వదు… ఇటు బతకనివ్వదు
వెంటనే రైలు ఎక్కింది కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ప్రయాణం చేస్తూ రత్లామ్ స్టేషన్‌లో దిగింది. రైల్వేస్టేషన్ లో కరణ్ దీప్ అనే యువకుడు కలిశాడు. ఇండోర్ లో యువతి కాలేజీలో చదువుతుండుగా అతడు ఆ కాలేజీలో ఎలక్ట్రిషీయన్‌గా పని చేసేవాడు. జరిగిన విషయం మొత్తం చెప్పడంతో అతడు ఆమెను ఇంటికి వెళ్లాలని సూచించాడు. తాను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని తాను ఇంటికి వెళ్తే చంపేస్తారని యువతి అతడికి తెలిపింది. యువకుడి వెంటనే సదరు యువతికి లవ్ ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమను ఆమె అంగీకరించడంతో ఇద్దరు కలిసి దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన కూతురు ఆచూకీ చెబితే బహుమానం అందిస్తానని సోషల్ మీడియాలో తండ్రి ప్రకటించాడు. తాను క్షేమంగా ఉన్నానని తండ్రికి యువతి సమాచారం ఇవ్వడంతో ఇంటికి రావాలని ఇద్దరికి కబురు పంపాడు. ప్రేమజంట స్థానిక పోలీస్ స్టేషన్‌లో వాంగ్మూలం ఇచ్చింది. ప్రస్తుతం పది రోజులు ఇద్దరిని విడిగా ఉంచుతున్నామని , అప్పటికీ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడితే పెళ్లి చేస్తామని యువతి తండ్రి అనిల్ తివారీ తెలిపాడు. ఈ ప్రేమ కథ బాలీవుడ్ లోని ‘జబ్ వీ మెట్’ మూవీ మాదిరిగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.