Thursday, June 12, 2025

ప్రియురాలి చితిలో దూకబోయిన భగ్న ప్రేమికుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రియురాలి చనిపోవడంతో ఆమె చితిలోకి భగ్న ప్రేమికుడు దూకాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కామలి ప్రాంతంలో ఓ యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడు మనస్తాపానికి గురై మద్యం తాగి ఆమె అంత్యక్రియలు జరిగే స్థలానికి వెళ్లాడు. ప్రియురాలి చితిలో దూకడానికి ప్రయత్నించడంతో ఆమె బంధువులు అతడి ఆపారు. అనంతరం అతడి చితకబాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు స్పృహలోకి వచ్చాక వాంగ్మూలం తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News