అమరావతి: పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో జరిగింది. అన్నమయ్య జిల్లా కెవిపల్లె మండలం మహల్‌రాజ్‌పల్లెకు చెందిన వంశీ(24), నందిని(19) గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యుల చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. సదరు ప్రేమ జంట తిరుపతిలో వెళ్లి ప్రేమపెళ్లి చేసుకున్నారు. గ్రామానికి దూరంగా ఉండాలని ప్రేమజంట నిర్ణయం తీసుకుంది. గ్రామం నుంచి మళ్లీ తిరుపతికి వెళ్తుండగా రొంపిచర్ల పోలీసులు వారిని పట్టుకున్నారు. జరిగిన విషయం చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరికి ప్రేమ పెళ్లి చేశారు. రక్షణ కోసం కెవిపల్లె పోలీసులకు రొంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీస్ స్టేషన్‌లో ప్రేమజంటకు పెళ్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -