లక్నో: ఏడేళ్ల కూతురుని తల్లి తన ప్రియుడితో కలిసి చంపింది. అనంతరం తన కూతురును భర్త చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోష్ని అనే మహిళ క్లబ్‌లో డ్యాన్సర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. రోష్నికి ఏడేళ్ల కూతురు ఉంది. క్లబ్‌లో పరిచయమైన ఉదిత్‌తో రోష్ని డేటింగ్ చేస్తోంది. వివాహేతర సంబంధానికి ఏడేళ్ల కూతురు అడ్డు రావడంతో చంపాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. ప్రియుడితో కలిసి కూతురును ముక్కు మూసి తల్లి చంపేసింది. మృతదేహాన్ని ఇంట్లో దాచి పెట్టి బయటకు వెళ్లింది. ఇంట్లోకి రాగానే దుర్వాసన రావడంతో తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన కూతురును తండ్రి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం కుళ్లిపోయి కనిపించడంతో తల్లిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శవపరీక్షలో ఊపిరాడక చనిపోయిందని తేలింది.
ప్రియుడితో కలిసి కూతురును చంపి… భర్త హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -