- Advertisement -
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ని చేజార్చుకున్న రాయల్స్ ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఓటమిని చవి చూసిన లక్నో జెయింట్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. తిరిగి ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ అతి చిన్న వయస్కుడైన వైభవ్ సూర్య వంశీని జట్టులోకి తీసుకుంది. 14 ఏళ్ల 23 రోజుల వయస్సు గత వైభవ్ ఐపీఎల్ ఆడుతున్న అతి చిన్నవాడిగా రికార్డుల్లోకి ఎక్కడాడు. ఇక లక్నో ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేసింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్‌ని జట్టులోకి తీసుకుంది.
- Advertisement -