Saturday, May 3, 2025

అది నాకే దక్కిన అదృష్టం

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి-, రామ్ చరణ్‌లు కలిసి చేసిన డాన్స్‌కు కొరియోగ్రఫీ అందించడం ఎంత అదృష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అదృష్టం శేఖర్ మాస్టర్‌కు రెండు సార్లు దక్కడం విశేషం. చిరంజీవి, రామ్ చరణ్ మొదటి సారి మగధీర సినిమాలో పాటలో కనిపించారు. ఆ పాటలో చిరంజీవి ఓల్డ్ వీడియోను గ్రాఫిక్స్‌తో కంపోజ్ చేసి రామ్ చరణ్, చిరంజీవి కలిసి డాన్స్ చేసేలా చూపించారు. ఆ తర్వాత ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించడంతో వీరిద్దరి కాంబోలో పాట ఉంది. మొత్తానికి ఈ రెండు సార్లు వారిద్దరూ కలిసి కాలు కదిపారు.

రెండు సార్లు కూడా చిరంజీవి-, రామ్ చరణ్‌లు కలిసి చేసిన పాటలకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ అందించడం విశేషం. తాజాగా ఆ విషయాన్ని గురించి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ “సాధారణంగా చిరంజీవికి కొరియోగ్రఫీ చేయడం అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసిన పాటలకు కొరియోగ్రఫీ అందించే అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ కొరియోగ్రాఫర్‌కి దక్కని అదృష్టం నాకే దక్కింది. ఇద్దరినీ కలిపి డాన్స్ చేయించే అవకాశం నాకు దక్కడం, అదీ రెండు సార్లు నాకే దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News