Thursday, July 24, 2025

లంచ్ బ్రేక్.. నిలకడగా ఆడుతున్న భారత్.. స్కోర్ ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత (Ind VS Eng) ఓపెనర్లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు కెఎల్ రాహుల్, యశస్వీ జైసాల్ బ్యాటింగ్‌తో పట్టుబిగించారు. ఇంగ్లండ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ.. వికెట్ మాత్రం కోల్పోలేదు. మంచి బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 82 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేయగా.. యశస్వీ జైస్వాల్ 74 బంతుల్లో 6 పోర్లు 1 సిక్సులతో 36 పరుగులు చేశాడు. 2023 తర్వాత తొలి సెషన్‌లో భారత్ వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేయడం ఇదే తొలి సారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News