Wednesday, April 30, 2025

పక్కింట్లోకి ఆడుకోవడానికి వెళ్తే… సలాకితో బాలుడిని కాల్చారు

- Advertisement -
- Advertisement -

ఆడుకోవడానికి వెళ్లిన బాలుణ్ణి సలాకితో కాల్చిన మహిళ

మన తెలంగాణ/మదనపురం: పక్కింట్లోకి ఆడుకోవడానికి వెళ్లిన బాలుల్ని పక్కింటి మహిళ సలాకితో కాల్చడంతో గాయాల పాలైన సంఘటన వనపర్తి జిల్లా మదనపురం మండల కేంద్రంలో వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాకు చెందిన భీమమ్మ అలియాస్ కవిత భర్త అయ్యప్ప ఏడు నెలల క్రితం జీవనోపాధి కోసం మదనపురంకు తమ కుమారుడు పరుశురాంతో వచ్చి ఓ ఇంట్లో అద్దెకు అంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం ఇంటి పక్కన ఉన్న గంగ ఇంటికి బాలుడు పరశురాం(06)  ఆడుకోవడానికి వెళ్లాడు. తమ పాపతో బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడని గంగా మరో మహిళ సరోజ సహాయంతో సలాకిని స్టవ్ మీద వేడి చేసి పరశురాం పిరుదులతో పాటు ప్రైవేట్ పార్ట్సు మీద కాల్చారు. బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి రావడంతో తల్లిదండ్రులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News