Friday, July 4, 2025

మరిపెడలో రెండు లారీలు ఢీ: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుడియతండా సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక్కసారిగా క్యాబిన్ లో మంటలు చెలరేగాయి. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు రైండు లారీలు డ్రైవర్లు, క్లీనర్ ఉన్నట్టు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News