Thursday, August 21, 2025

పెచ్చులూడిన కొత్త కలెక్టరేట్… ఆర్అండ్ బి ఈఈకి తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /మహబూబ్ నగర్ బ్యూరో: రోడ్డు భవనాల శాఖ, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్షంతో నూతన కలెక్టరేట్ భవనం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చింది. కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభమై 3 సం.రాలు గడవకముందే పెచ్చులూడుతున్నాయి. అది కూడా స్వయంగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పర్యవేక్షించి రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలోనే పెచ్చులుడాయి. బుధవారం రాత్రి ఈ కార్యాలయంలో ఎవరు లేని సమయంలో పెచ్చులు ఉండడంతో ఈఈ కి ప్రమాదం తప్పింది. ఉదయం చూసేసరికి ఈఈ కార్యాలయంలో పెచ్చులూడడం చూసి కార్యాలయ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నూతన కలెక్టరేట్ భవనం రూ 40 కోట్లతో గత బీఆర్‌ఎస్ ప్రభత్వుం నిర్మాణం చేపట్టింది.

ఈ భవన నిర్మాణానికి కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఇది ఈ కలెక్టరేట్ పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన ఆర్ అండ్ బి అధికారులు, ఇంజనీరులు మామూలుగా అలవాటు పడి నిర్లక్షంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుంది. దీంతో కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యతకు మంగళం పాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్ పనులు చేసిన కాంట్ట్రార్ ఇప్పటికే అన్ని బిల్లులు డ్రా చేసుకునట్లు తెలుస్తోంది. వాస్తవానికి పనులు పూర్తయినప్పటికీ నాణ్యత లేకపోతే ఫైనల్ బిల్లు పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిర్ధిష్ట సమయం వరకు కలెక్టరేట్‌లో ఏం జరిగినా సంబంధిత కాంట్రాక్టర్‌కే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు కలెక్టరేట్‌లోనే పెచ్చులు ఊడుతుండడంతో నూతన కలెక్టరేట్ భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాసిరకం మెటీరియల్ వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉండే కలెక్టరేట్ భవనంలో అధికారులకు రక్షణ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయంలో ఎక్కడ చూసినా కూడా లీకేజి గురై వర్షపు నీరు చేరుతోంది. దీంతో ఈ నూతన కలెక్టరేట్ భవనం నాణ్యత లేదనే విషయం తెలుస్తోంది. అప్పట్లో నాణ్యతపై చర్యలు తీసుకోవాల్సిన ఆర్ అండ్ బి అధికారులు మామూలు వ్యవహారంలో మునిగి తేలడంతోనే పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కాంట్రాక్టర్ పనులపై విచారణ చేపట్టి నూతన కలెక్టరేట్ భవనం పనులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News