మహమ్మారి కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 52 కొవిడ్ పాజిటీవ్ కేసులను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. జనవరి నుండి ఇప్పటివరకు 106 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపింది.వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. వీటిలో 101 కేసులు ముంబైలో నమోదైనట్లు వెల్లడించింది.
మంగళవారం మరో 19 కోవిడ్ కేసులు బయటపడినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో 15 ముంబైలో, 3 కొల్హాపూర్‌లో, ఒకటి పూణేలో గుర్తించినట్లు చెప్పారు. పాజిటివ్‌గా నిర్ధారించబడిన ఓ వ్యక్తి కొంతకాలం క్రితం కోలుకున్నాడని పూణేలోని ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్టరంలో 52 మంది కోవిడ్ పాజిటివ్ రోగులు ఉన్నారని.. వారు ఇంట్లో కోలుకుంటున్నారని చెప్పారు. 16 మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.