- Advertisement -
ముంబై: మహారాష్ట్రలో మహమ్మారి కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదివారం 43 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరుకుందని తెలిపింది. తాజాగా బయటపడిన కేసుల్లో ముంబైలో 35, పూణేలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి మహారాష్ట్రలో మొత్తం 300 COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే ఏకంగా 248 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -