Monday, July 21, 2025

ప్రేక్షకుల్లో ‘మహావతార్ నరసింహ’ కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది

- Advertisement -
- Advertisement -

హోంబాలే ఫిలమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ (Mahavatar Narasimha) వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. మహావతార్ నర్సింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిలమ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే విడుదలైన మహావతార్ నరసింహ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ (Geetha Film Distribution) ద్వారా జూలై 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అశ్విన్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘యానిమేషన్‌లోనే ఈ సినిమాని నిర్మించాలని ఆలోచన మొదటి నుంచి ఉంది. శ్రీమహావిష్ణువు కథని చెప్పాలంటే యానిమేషన్ అనేది ఒక బెస్ట్ మీడియం. కొన్నిసార్లు నటులు దేవుని పాత్రలు చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అప్పటివరకు చేసిన సినిమాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడుతుంది. అందుకే ఎపిక్ కథల్ని చెప్పడానికి యానిమేషన్ బెస్ట్ మీడియం అని భావించాం.

ప్రతి అవతారానికి ఒక విశిష్టత ఉంది. నరసింహ అవతారం నేటి సమాజానికి ముఖ్యంగా యువతకి చాలా అవసరం. నరసింహ స్వామి రక్షకుడు. నరసింహ స్వామి అవతారం ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నాము. ఇది మైథాలజీ కాదు.. ఇది మన చరిత్ర. ప్రతి తరానికి మన చరిత్రని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలకి, ఈ తరం యువతకి మన చరిత్ర తెలియజేయాలి. ఇక నెకస్ట్ మహావతార్ పరశురాం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. అది కూడా చాలా పెద్ద స్కేల్‌లో ఉంటుంది’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News