హోంబాలే ఫిలిమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ ‘మహావతార్ నరసింహ’ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ అత్యద్భుతంగా వుంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ ట్రైలర్ విజువల్ వండర్‌లా వుంది. సినిమా నెక్స్ లెవెల్ కి చేరుకుంది. భారతీయ చరిత్ర నుండి ఈ ఐకానిక్ కథను ఇంత అద్భుతంగా చూపడం ఇంతవరకు చూడలేదు.
ఈ సందర్భంగా నిర్మాత శిల్పా ధావన్ మాట్లాడుతూ.. “శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది. నర్సింహ గర్జన వస్తోంది”అని అన్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ “మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైంది”అని తెలిపారు. మహావతార్ నరసింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిలమ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 3డి లో ఐదు భారతీయ భాషలలో 2025 జూలై 25న విడుదలవుతోంది.