Sunday, August 31, 2025

కుమారుడి పుట్టినరోజున.. మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమాల్లో ఎంత బిజీగా ఉంటారో.. కుటుంబంతో కూడా అంతే సమయం గడుపుతుంటారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తుంటారు. అయితే ఈసారి మహేశ్ #SSMB29 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన కుమారుడు గౌతమ్ పుట్టినరోజుకు అతడి దగ్గర లేకుండ అయిపోయింది. దీంతో ఆయన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు. 19వ వసంతంలో అడుగుపెడుతున్న గౌతమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్ చిన్నతనంలో అతడితో దిగిన ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘‘నీ పుట్టినరోజుకి అందుబాటులో లేకుండా పోవడం ఇదే తొలిసారి’’ అని పేర్కొన్నారు.

తన ప్రేమ ప్రతీ అడుగులో గౌతమ్‌తో ఉంటుందని.. అతడు ఎప్పుటికీ ఇలాగే ప్రకాశిస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలి అని మహేశ్ (Mahesh Babu) కోరుకున్నారు. ఈ పోస్ట్‌పై మహేశ్‌బాబు అభిమానులు, నెటిజన్లు గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, మహేశ్, రాజమౌళితో కలిసి చేస్తున్న సినిమా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా అప్‌డేట్‌ని విడుదల చేశారు. నవంబర్‌లో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ నైరోబి, టాంజానియాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : బాలయ్య పంచ్ డైలాగ్స్‌తో అదరగొట్టి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News