Tuesday, July 8, 2025

వైద్యురాలు ఫిర్యాదు… మహేష్ బాబుకు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌పై నమోదయిన కేసులో నటుడు మహేష్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫారం నోటీసులు జారీ చేసింది. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్‌తో ప్రమోషన్ చేయడంతోనే ఫ్లాట్ కోనుగోలు చేశానని ఓ వైద్యురాలి ఫిర్యాదులో పేర్కొనడంతో వినియోగదారుల ఫారం ఈ నోటీసులు ఇచ్చింది. బాలాపూర్ గ్రామ పరిధిలోని సాయి సూర్య డెవలపర్స్ లే అవుట్ వేశామని చెప్పడంతో ఆకర్షితులైన ఓ వైద్యురాలు, మరో వ్యక్తితో కలిసి చెరో ప్లాటు కొనడానికి రూ. 34.80 లక్షలు చెల్లించారు.

అనంతరం ప్రతిపాదిత ప్రాంతంలో లే అవుట్ లేదని తెలుసుకొని కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాన్యాన్ని అడిగగా సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్తా కేవలం రూ. 15 లక్షలు మాత్రమే వెనక్కి తిరిగి ఇచ్చారని పేర్కొంటూ భాధితురాలు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫారం కోర్టులో ఫిర్యాదు చేశారు. సంస్థతో పాటు ప్రచార కర్తగా ఉన్న మహేష్ బాబును ప్రతివాదులుగా చేర్చారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫారం సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండి సతీష్ చంద్రగుప్తా, ప్రమోషన్ చేసిన మహేష్ బాబులకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన వారు న్యాయవాదులతో లేదా వ్యక్తిగతంగా హాజరు కావచ్చని పేర్కొంది. అనంతరం ఈ కేసు నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News