Wednesday, September 17, 2025

‘లిటిల్ హార్ట్స్‌’పై మహేశ్ పోస్ట్.. ‘ఎక్కడి వెళ్లకు’ అంటూ చమత్కారం

- Advertisement -
- Advertisement -

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా తనకు నచ్చితే చాలు ప్రొత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు హీరో మహేశ్ బాబు (Mahesh Babu). సినిమా నచ్చిన వెంటనే ఆయన ఎక్స్ ఖాతాలో సినిమా బృందాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా విడుదలై గ్రాండ్స్ సక్సెస్‌ని అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళీ, శివానీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకున్నారు.

తాజాగా మహేశ్‌బాబు (Mahesh Babu) కూడా ఈ సినిమాను మెచ్చుకుంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘లిటిల్ హార్ట్స్‌.. ఆద్యంతం సరదాగా సాగే వినోదభరితమైన సినిమా. కొత్త నటీనటులు అయినా.. చాలా బాగా నటించారు. అద్భుతమైన నవ్వుల రైడ్ ఈ చిత్రం. సింజిత్ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్. ఎందుకంటే నువ్వు కొన్ని రోజుల్లో చాలా బిజీ అయిపోతావ్’’ అంటూ మహేశ్ పోస్ట్ చేశారు. మహేశ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గురించి ప్రత్యేకంగా పోస్ట్ చేయడానికి కారణం ఉంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సింజిత్ మాట్లాడుతూ.. తాను మహేశ్ బాబుకు వీరాభిమానినని.. లిటిల్ హార్ట్స్ సినిమా చూసి మహేశ్ పోస్ట్ చేస్తే.. ఆ ఆనందంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎటైనా వెళ్లిపోతానని అన్నాడు. అందుకే మహేశ్ తన పోస్ట్‌లో ప్రత్యేకంగా సింజిత్‌ను ఉద్దేశించి అలా చమత్కరించారు.

Also Read : గంభీర జీవితాన్ని మలుపు తిప్పే కణ్మనిగా కనిపిస్తా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News