- Advertisement -
హైదరాబాద్: కరీంనగర్ బిజెపి ఎంపిలు దొంగ ఓట్లతో గెలిచారని టిపిసిసి ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. దొంగ ఓట్లతో గెలిచినట్టు తమ దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. మహేష్ మీడియాతో మాట్లాడుతూ..బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ కి మెజారిటీ ఎలా వస్తుంది? అని ఒకే డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. బండి సంజయ్ అసలు బిసినే కాదని ఆయన దేశ్ ముఖ్ అని తెలియజేశారు. తెలంగాణలో ఓట్ల చోరిపై (vote theft) ఇసిని కలుస్తామని అన్నారు. ఎన్నికల సంఘం ఇలా ఉండటం మన దౌర్భాగ్యం అని ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపి అర్వింద్ గెలుపుపై కూడా అనుమానం ఉందని మహేష్ కుమార్ గౌడ్
పేర్కొన్నారు.
Also read : రాజీనామా చేసి గెలిచే దమ్ముందా?
- Advertisement -