- Advertisement -
హైదరాబాద్: గత ప్రభుత్వం అక్కసుతో రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా ఇవ్వలేదని కాంగ్రెస్ టిపిసిసి ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తుంటే బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి బండి సంజయ్ కి ఇది మంచి పద్దతి కాదని సూచించారు. యూరియా కోసం (For urea) సిఎం రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారని తెలియజేశారు. బిజెపి, బిఆర్ఎస్ లో లోపాకారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నాయని, కాంగ్రెస్ అబాసుపాలు చేయాలని బిజెపి, బిఆర్ఎస్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
- Advertisement -