Wednesday, April 30, 2025

బిజెపిని గెలిపించేందుకే కెటిఆర్ తాపత్రయం: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

లోకల్ బాడీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేందుకే కెటిఆర్ తాపత్రయం
అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే బిజెపితో బిఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం
టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: లోకల్ బాడీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేందుకే కెటిఆర్ తాపత్రయ పడుతున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే బిజెపితో బిఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ బిజెపి పార్టీకి కట్టుబానిసలా కెటిఆర్ పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. సంఖ్యా బలం లేని బిజెపి బిఆర్‌ఎస్ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న బిఆర్‌ఎస్ నాయకులు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బిజెపితో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పని చేసిన బిఆర్‌ఎస్ నాయకుల అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని ఆయన ఆరోపించారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బిజెపి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేస్తుందన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన బిఆర్‌ఎస్ నాయకులు బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. పదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా అని కెటిఆర్‌ను పిసిసి అధ్యక్షుడు నిలదీశారు.

పదేళ్లలో మోడీ నిర్ణయాలకు మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడటానికి బిజెపికి ఊడిగం చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు హెచ్‌సియూపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. పదిహేను నెలల స్పల్ప కాలంలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలివ్వడం, రైతు, మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బిసిలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, పేదలకు సన్నబియ్యం అందించడం వంటి గొప్ప పనులను రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఆయన ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News