- Advertisement -
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటు కోవాలనే బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తపన అని టిపిసిసి ఛీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వాదనలో పస లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీలో నీటిపారుదల అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిఎంలు, నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారుల సమావేశంలో ఏం మాట్లాడారో స్వయంగా కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్ చెప్పినా కూడా హరీష్ రావు పిచ్చివాగుడు వాగుతున్నారని, తెలంగాణ ప్రజలను (People Telangana) తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్దారు. ఎపి ప్రాజెక్టులు కట్టుకున్నా తమకు సమస్య లేదని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది బిఆర్ఎస్ పార్టీనే అని మహేష్ గౌడ్ విమర్శించారు.
- Advertisement -