Tuesday, August 26, 2025

ఓట్ చోరీతోనే బిజెపి గెలుపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వర్ధన్నపేట (వరంగల్):రాష్ట్రం లో కాంగ్రెస్‌కు పోటీ ఏ పార్టీ లేదని, ప్రతిపక్షం అం తకన్నా లేదని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా, ఇల్లందు నుండి వద్దన్నపేట వరకు పిసిసి చీఫ్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ నాగరాజు ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర జరిగింది. సోమవా రం రాత్రి జరిగిన పార్టీ జనహిత పాదయాత్ర సభ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత, – కెటిఆర్ పంచాయితీ తెగేసరికి మరో పదేళ్లు పడుతుందని, గడిచిన పదేళ్లు మో సం చేసిన కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చున్నారని అ న్నారు. దోచుకున్న సొమ్ము బయటకు తీయమం టే వారు సుప్రీంకోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. వాళ్ళు రాజకీయంగా ఉండరని ఎద్దేవా చేశారు.

వ చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్లు గెలుస్తుందని, ఇ దే వర్ధన్నపేట గడ్డపై విజయోత్సవ సంబరాలు జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఏ ర్పాటు చేసిన సభలో మహేశ్ కుమార్ గౌ డ్ మాట్లాడుతూ.. దొంగ ఓట్లపై ప్రశ్నిస్తే ఇసి బిజెకికి వత్తాసు పలుకుతోందన్నారు. ఆదివారం తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తెలంగాణలో గెలిచి న 8 మంది బిజెపి ఎంపిల గెలుపు పట్ల తమకు అ నుమానం ఉందన్నారు. తెలంగాణలో ఓట్ల దొంగిలింపు జరిగిందనే ఆరోపణలు చేస్తే తనపై విమర్శ లు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఆ ఫ్ ఇండియా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ బిజెపికి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఓటు వేసిన వారు నిజామాబాద్‌లో కూడా వేశారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News