హైదరాబాద్: పదేళ్లు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు వాటాలో తేడా వచ్చి బయటపడుతున్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులపై కల్వకుంట్ల కవిత చేసిన సంచలన కామెంట్స్ పై ఆయన స్పందించారు. ఈ మేరకు మహేష్ కుమార్ మాట్లాడుతూ.. కవిత మాట్లాడిన విషయాలన్నీ నిజమేనన్నారు. రాష్ట్రంలో గత పదేళ్ల పాటు యథేచ్ఛగా దోపిడీ జరిగిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కవిత కూడా కీలకంగా ఉన్నారు. దోపిడీలో కవిత కూడా భాగస్వామి అని.. ఆమెకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా? అని అన్నారు. పదేళ్లు ప్రజల సొమ్ము దోచుకుని ఇప్పుడు పంపకాల్లో విభేదాలు వచ్చి బయటపడుతున్నారని విమర్శించారు. హరీష్ రావుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన కవిత ఆధారాలు ఇస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఉండదని మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
10 ఏళ్ల దోపిడిలో కవిత కూడా భాగస్వామి.. వాటాలో తేడా వచ్చి బయటపడ్డారు: పిసిసి చీఫ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -