Saturday, May 24, 2025

కెసిఆర్‌కు పట్టిన దెయ్యం కెటిఆరే: మహేశ్‌ గౌడ్‌

- Advertisement -
- Advertisement -

మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు పట్టిన దెయ్యం కెటిఆరేనని పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఎద్దేవా చేశారు. శనివారం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన ఝలక్‌తో కెటిఆర్‌కు మతి భ్రమించిందని అన్నారు. కెటిఆర్‌కు అధికార దెయ్యం పట్టిందని చురకలంటించారు. కెసిఆర్‌కు పట్టిన దెయ్యం కెటిఆరేనని కవిత చెప్పకనే చెప్పారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కెటిఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.కెసిఆర్, హరీశ్‌రావుకు నోటీసులు అందడంతో కెటిఆర్‌ షాక్‌లో ఉన్నారని.. అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియటం లేదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News