ముంబై: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్ (MTB) “అత్యధిక మేలేజీ పొందండి లేదా ట్రక్కును వాపసు ఇవ్వండి” అనే విశిష్టమైన హామీతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్కుల శ్రేణి మహీంద్రా ఫ్యూరియో 8 (FURIO 8)ను ఆవిష్కరించింది. మహారాష్ట్రలోని చకాన్‌లో ఉన్న మహీంద్రా అధునాతన ప్లాంటులో తయారైన ఫ్యూరియో 8 వాహనం, ఎల్‌సీవీ సెగ్మెంట్లో వివిధ అవసరాలకు అనుగుణంగా, ప్రధానంగా 4 టైర్ కార్గో, 6 టైర్ కార్గో అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అత్యధిక లాభదాయకంగా ఉండేలా రూపొందించిన ఫ్యూరియో 8 అనేది తన విభాగంలోని మిగతా వాహనాలతో పోలిస్తే అత్యుత్తమ మైలేజీ, అత్యధిక పేలోడ్ సామర్థ్యాలు, సౌకర్యం-సదుపాయం-భద్రతకు పెద్ద పీట వేస్తూ అధునాతనమైన క్యాబిన్ తదితర ఫీచర్లతో లభిస్తుంది. ఈ విభాగంలో అసామాన్యమైన ప్రయోజనాలను, అత్యధిక లాభాలను అందించే విధంగా ఫ్యూరియో 8 రూపొందించబడింది. అందుకే ‘ట్రక్ బద్లో, తక్‌దీర్ బద్లేగీ‘ (ట్రక్కును మార్చండి, భవిష్యత్తు మారుతుంది” అనే నినాదం దీనికి చక్కగా సరిపోతుంది.
“’అత్యధిక మైలేజీని పొందండి లేదా ట్రక్కును వాపసు చేయండి’ అనే హామీతో ఆవిష్కరించిన మా కొత్త మహీంద్రా ఫ్యూరియో 8 శ్రేణి ఎల్‌సీవీ ట్రక్కుల శ్రేణి, ఈ కేటగిరీ వాహనాలను ఉపయోగించే మా కస్టమర్లు అత్యధిక నిర్వహణ లాభాన్ని ఆర్జించేందుకు ఉపయోగపడుతుంది. శ్రేష్ఠత, కస్టమర్లకు ప్రయోజనాలను చేకూర్చడంలో కొత్త ప్రమాణాలను సృష్టించే విధంగా ఈ కొత్త ట్రక్ సిరీస్ రూపొందించబడింది” అని మహీంద్రా గ్రూప్ యొక్క గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు మరియు ప్రెసిడెంట్ (ట్రక్కులు, బస్సులు, సీఈ, ఏరోస్పేస్ & డిఫెన్స్) Mr. వినోద్ సహాయ్ తెలిపారు.
“అత్యధిక ఆదాయాలు, అత్యంత తక్కువ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ (TCO), తక్కువ మెయింటెనెన్స్ భారం, అసమానమైన భద్రత, సౌకర్యం, సౌలభ్యంలాంటి ప్రయోజనాలతో మా కస్టమర్లకు లాభాలు, నిశ్చింత, శ్రేయస్సును అందించే విధంగా మహీంద్రా ఫ్యూరియో 8 రూపొందించబడింది” అని MTB & CE బిజినెస్ హెడ్ Dr. వెంకట్ శ్రీనివాస్ తెలిపారు.
వర్క్‌షాప్‌లలో 36 గంటల గ్యారంటీడ్ టర్నెరౌండ్ లేదా ప్రతి అదనపు రోజుకు రూ. 3,000; 48 గంటల్లో వాహనం మళ్లీ రోడ్డు మీదకి చేరడం లేదా ప్రతి అదనపు రోజుకు రూ. 1,000 లాంటి డబుల్ సర్వీస్ గ్యారంటీలతో ఫ్యూరియో 8 లభిస్తుంది. అంతేగాకుండా, ఫ్యూరియో 8లో లొకేషన్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్, వాహన ఆరోగ్య పర్యవేక్షణ, డ్రైవర్ పనితీరు విశ్లేషణ, ఫ్లీట్ డ్యాష్‌బోర్డ్‌లు మొదలైన అనేక ప్రయోజనాలను అందించే భారతదేశపు అత్యంత అధునాతనమైన టెలీమ్యాటిక్స్ టెక్నాలజీ అయిన మహీంద్రా iMAXX ఉంది.