Monday, May 19, 2025

చాహల్‌ గురించి అలా చెప్పిన మహ్‌వశ్.. మళ్లీ ప్రేమ చర్చ మొదలు

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ (Yuzvendra Chahal), రేడియో జాకీ మహ్‌వశ్‌తో డేటింగ్‌లో ఉన్నారని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. చాహల్ తన భార్య ధనశ్రీకి విడాకులు ఇవ్వడం.. ఆ తర్వాత ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను మహ్‌వశ్‌తో కలిసి చూడటం.. తదితర విషయాలు చూసి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని అంతా అనుకున్నారు. కానీ అతన్ని నిజం కాదని వీరిద్దరు తోసిపుచ్చుతున్నారు. అయితే తాజాగా చాహల్ గురించి మహవశ్ (Mahvash) చేసిన కొన్ని కామెంట్స్ వీళ్లిద్దరి మధ్యలో ప్రేమ ఉందనే చర్చ మళ్లీ మొదటికి తెచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహ్‌వశ్ పాల్గొంది.

ఈ సందర్భంగా విలేఖరి.. చాహల్‌లో మీకు ఏ లక్షణం అంటే ఇష్టం అని ప్రశ్నించగా.. అతను చాలా మంచి వాడు అని.. వినయపూర్వకంగా ఉంటాడని.. చాలా కేరింగ్ వ్యక్తి అని చెప్పింది. దీంతో పాటు.. ఎంత బిజీగా ఉన్నా.. ప్రేమించిన వాళ్ల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడని చాహల్‌ను ప్రశంసలతో ముంచేత్తింది. ఇలాంటి లక్షణాలను చాహల్ నుంచి తాను అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధంపై సోషల్‌మీడియాలో రచ్చరచ్చగా చర్చ నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News