- Advertisement -
షాద్ నగర్ లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం
ఎమ్మెల్యే శ్రీహరి ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఐ20 కార్
తృటిలో తప్పిన ప్రమాదం
షాద్ నగర్: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న టిజి 38 3339 అనే నంబరు గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు.
- Advertisement -