- Advertisement -
హైదరాబాద్ లోని మలక్ పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహననగర్ లోని ఓ పార్కులో వాకర్స్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చందునాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు. వాకర్స్ ప్రాణ భయంతో పార్కులో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల వాసిగా గుర్తించారు. భూవివాదాల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -