- Advertisement -
చెన్నై: రోడ్డు ప్రమాదంలో నటుడు షైన్ టామ్ చాకో తండ్రి మృతి చెందాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పాలకోట్టాయ్ ప్రాంతంలో జరిగింది. దీంతో షైన్ టామ్ ఇంట్లో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నటుడు షైన్ టామ్ చాకో తన తండ్రి, తల్లి, సోదరుడు, కారు డ్రైవర్‌తో కలిసి కారులో వెళ్తున్నాడు. తమిళనాడు సరిహద్దులోని ధర్మపురి శివారులో జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొనడంతో టామ్ తండ్రి సిపి చాకో ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -