- Advertisement -
జాక్ మూవీ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న సినిమా ‘తెలుసు కదా’. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి తెరెక్కిస్తున్న మొదటి చిత్రం ఇది. తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘మల్లిక గంధ’ అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం సారథ్యంలో ఈ సాంగ్ ను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
- Advertisement -