Sunday, May 4, 2025

కులగణన పై కాలయాపనేనా?

- Advertisement -
- Advertisement -

మోడీ చిత్తశుద్ధిపై సిడబ్లూసి సందేహాలు
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ.. కేంద్ర
ప్రభుత్వ నిర్ణయం విస్మయకరం
పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా
కేంద్రం నుంచి ప్రతీకార చర్య ఏది?
ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదనలు
రాలేదు కేంద్రం వెంటనే స్పందించి
పాక్‌ను ఏకాకిని చేయాలి జాతి
యావత్తు సమైక్యంగా స్పందిస్తుంది
ఇది రాజకీయాలకు సమయం కాదు
విద్వేషకర, విభజిత రేఖలకు దిగరాదు
భారత్ ఐక్యంగా నిలుస్తుందని చాటి
చెబుదాం తక్షణ చర్యతోనే ఉగ్రవాదానికి
తగు జవాబు సిడబ్లూసిలో తీర్మానం

న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడులు తరువాత పాకిస్థాన్‌తో తెగిన దౌత్య సంబంధాలు, దేశంలో కులగణనకు కేంద్ర నిర్ణయం వంటి కీలక పరిణామాల మధ్య శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జరిగింది. చివరిలో పహల్గామ్ పేరిట తీర్మానం వెలువరించింది. పార్టీకి చెందిన ఈ అత్యంత సమున్నత విధాన నిర్ణయాక విభాగం అ యిన సిడబ్లుసి భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జు న ఖర్గే సారధ్యంలో సమావేశం జరిగింది. ముందుగా పహల్గాం ఉగ్రదాడి , అనంత ర పర్యవసానాలపై కార్యవర్గం దృష్టి సారించింది. పహల్గాం ఉగ్రదాడి జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత కీలకం. ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి కీలక నిర్ణయం అది ఎంత తీవ్రతరమైనా తమ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుంది. జాతీయ భద్రతా రక్షణ విషయాలలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాం గ్రెస్ వ్యవహరిస్తుందని ఖర్గే మీడియాకు తెలిపారు.

అయితే  ఇప్పటివరకూ ఈ ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్థిష్ట చర్యలకు దిగలేదు. కనీసం ఈ దిశలో ఎటువంటి సంకేతాలూ వెలువరించలేదు. పొరుగు దేశం నుంచి వెలవడే సవాలును ఎదుర్కొనేందుకు కేంద్రం ఇప్పటి వరకూ ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఖర్గే విమర్శించారు. పొరుగుదేశం దూకుడు వ్యవహారం తిప్పికొట్టే విషయంలో కేంద్రం తిరుగులేకుండా వ్యవహరించవచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్ ఒక్కటే కాకుండా మిగితా ప్రతిపక్షం అంతా ఒకేతాటిన నిలిచి , కేంద్రానికి బాసటగా నిలుస్తుంది అయితే అత్యంత కీలకమైన విషయంలో ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి వెలువడలేదని ఖర్గే తెలిపారు.

కులగణన నిర్ణయం మంచిదే కేంద్ర వైఖరి అనుమానాస్పదమే
వేశంలో సముచిత రీతి సామాజిక న్యాయానికి కులగణన జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కేంద్రం సముచిత రీతిలో ఈ దిశలో నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి దశలో , ప్రత్యేకించి పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ జాతీయ స్థాయి విశేష పరిణామంపై కేంద్ర నిర్ణయం పార్టీ వర్గాలను విస్మయపర్చిందని ఖర్గే తెలిపారు. నిజానికి కేంద్రానికి, ప్రత్యేకించి కులగణనకు వ్యతిరేకమైన మోడీకి ఈ ప్రక్రియపై చిత్తశుద్ధి ఉందా? దీనిని కేవలం కాలాయాపన కంటితుడుపుగా కానిస్తారా అనేది తమ ముందున్న సందేహం అని ఖర్గే తెలిపారు. ఏది ఏమైనా కులగణనకు క్షేత్రస్థాయిలో ఓ సవ్యమైన తుది రూపం వచ్చేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ దశలో కేంద్రం కదలికలను పార్టీ నాయకులు క్షేత్ర స్థాయి వ్యవస్థలతో గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలని సిడబ్లుసి హెచ్చరించింది. పార్టీ నాయకులు రాహుల్ గాంధీ కులగణనపై పట్టు వదలని రీతిలో చేసిన పోరు వల్లనే కేంద్రం ఇప్పుడు ఈ విషయంలో నిర్ణయానికి దారితీసిందని పార్టీ అభిప్రాయపడింది. రాహుల్ గాంధీని ఈ నేపథ్యంలో సిడబ్లుసి అభినందించింది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక , వేణుగోపాల్ , జై రాం రమేష్ ఇతర నేతలు హజరయ్యారు.

సమైక్యంగా ఉగ్రదాడికి జవాబు
ఇక్కడ ఎఐసిసి కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ తరువాత కీలక తీర్మానం వెలువరించింది. పహల్గాం ఉగ్రదాడి దేశ భద్రత సమైక్యత సమగ్రతలపై జరిగిన దాడిగా స్పందించింది. దేశ ఐక్యత జాతీయ దకృథం , కలిసికట్టుతనం ఇతివృత్తంగా అంతా కలిసి స్పందించాల్సి ఉందని పార్టీ తీర్మానంలో పిలుపు నిచ్చారు. దాడి జరిగి రోజులు అవుతున్నాయి. గాయం మిగిలి ఉంది. ఇప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి నిర్థిష్ట చర్య కానీ సంబంధిత సంకేతాలు కానీ వెలువడలేదు. కేంద్రం వెంటనే అంతర్జాతీయ స్థాయిలో స్పందించి పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాల్సి ఉంది. జరిగిన దాడి పట్ల జాతి యావత్తూ జవాబుదారిని , ఎందుకిలా జరిగిందనే జవాబును, తక్షణ న్యాయాన్ని కోరుతోందని తీర్మానంలో తెలిపారు. 26 మంది పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపొయ్యాయి. పర్యాటకుల భద్రతకు సవాలు ఏర్పడింది.

ఇకపై కూడా పలు సవాళ్లకు దారితీస్తోందని తీర్మానంలో తెలిపారు. పొరుగుదేశ ఉగ్ర చర్యకు తగు విధమైన సమిష్టి జవాబు ఇవ్వాల్సి ఉంది. జాతిగా సంయుక్తంగా స్పందించాల్సి ఉందని తెలిపారు. ఉగ్రవాదంపై నిరిష్టరీతిలో గట్టి దెబ్బకు దెబ్బ ఇవ్వాల్సి ఉంది. ఇక జాప్యం లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి కాంగ్రెస్ ఈ వేదిక తీర్మానం ద్వారా పిలుపు నిచ్చింది. ఇది రాజకీయాలకు సమయం కాదని , వేర్పాటు విద్వేషకర వభజిత రేఖలకు దిగరాదని , భారత్ ఐక్యంగా నిలుస్తుందని చాటి చెపుదామని , ప్రస్తుత దశలో చెక్కుచెదరని రీతిలో ఐక్యతను చాటుకుందామని ,ఈ లక్షణాన్ని ప్రపంచానికి చాటుదామని తెలిపారు. కులగణన ఇతర విషయాలు ఉన్నప్పటికీ తక్షణ విషయం జాతీయ భద్రతా విషయం పహల్గాం ఉగ్రదాడి అంశం కాబట్టి కాంగ్రెస్ ఈ విషయానికి ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ తీర్మానంలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News