Saturday, August 16, 2025

పవర్ కోసం పాపాలు.. ఓట్ల అక్రమాలు: బిజెపిపై ఖర్గే విమర్శలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః అధికారంలో కొనసాగేందుకు బిజెపి ఎంతకైనా తెగిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. అక్రమాలతో ఎన్నికల్లో గెలవడం ద్వారా బిజెపి తన అధికారం కాపాడుకొంటోంది. పలు సంబంధిత ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. స్థానిక ఇందిరా భవన్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన జాతీయ జెండా ఎగురవేసి, నేతలు కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు. కుర్సీకి అతుక్కుపోయ్యేందుకు బిజెపి దొడ్డిదారులు అనుసరిస్తుంది. ఎంతటి అనైతికం అరాచకం అయినా సాగిస్తుందని ఖర్గే మండిపడ్డారు. ప్రతిపక్షాల ఓట్లకు గండికొట్టేందుకే బీహార్‌లో ఇసి ద్వారా ఓటర్ల జాబితా సవరణలు చేపట్టారని, దారుణమైన రీతిలో లక్షలాదిగా వడబోతలు, కూడికలు సాగుతున్నాయని విమర్శించారు. అక్కడ మృతుల పేర్లు జాబితాలలో ఉంటున్నాయి. సజీవుల పేర్లు గల్లంతు అవుతున్నాయి. కొందరు బతికుండగానే చనిపోయిన వారి చిత్రగుప్త చిట్టాలో చేరుతున్నారని విమర్శించారు. సర్‌పై కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకే అని తెలిపారు.

బీహార్ ఓటర్ల జాబితాను, తీసివేసిన ఓటర్ల పేర్లు వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల స్పందనను న్యాయస్థానం అర్థం చేసుకుందని వ్యాఖ్యానించారు. అన్ని కేంద్రీయ దర్యాప్తు సంస్థలు బహిరంగంగా రాజకీయ ఉద్ధేశాలతో పనిచేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలను లక్షంగా చేసుకుని వ్యవహరిస్తున్నాయని , దీనిని సుప్రీంకోర్టు వెలుగులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. మన విదేశాంగ విధానం విఫలం అయిందని అన్నారు. గతంలో మనం వర్థమాన దేశాల పక్షాన నిలబడే వాళ్లం. ఇప్పుడు మనం ఇరుగుపొరుగు , దూర ప్రాంత దేశాలతో కూడా సఖ్యత లేకుండా చేసుకుంటున్నామని , ఇది దేశానికి విపత్కర పరిస్థితిని తెచ్చిపెడుతుందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News