హైదరాబాద్ ఎల్‌బిస్టేడియంలో
కాంగ్రెస్‌శ్రేణుల సమ్మేళనం హాజరు
కానున్న ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే
ఇలాంటి సమ్మేళనం జరగడం
దేశంలోనే తొలిసారి ఏర్పాట్లను
పరిశీలించిన మీనాక్షి నటరాజన్, భట్టి,
మహేశ్‌కుమార్‌గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి:స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీ ట్లను కైవసం చేసుకోవడమే లక్షంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక ఎ న్నికల్లో గ్రామ స్థాయి నాయకుల పాత్రే కీలకం కాబట్టి ఈ నెల 4న (శుక్రవారం) హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో గ్రామ స్థాయి నేతల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టింది. బుధవారం ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రభృతులు ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం కురిసినా ఇబ్బంది లే కుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు. స్టేడియం మధ్యలో గ్రామ స్థాయి నాయకులు కూర్చునే విధంగా, స్టేడియం చుట్టూర ఉండే గ్యాలరీలో సామాన్య కార్యకర్తలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతిపక్షాలను చిత్తు చేసి తొంబై శాతం సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నది. కాగా బిసి రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రాకుండా రాష్ట్ర ప్ర భుత్వం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తుందా? అనే అనుమానాలు అన్ని పార్టీల నేతలు వ్య క్తం చేస్తున్నారు. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. గ్రామ స్థాయి నాయకులే సుమారు పదిహేను వేల మంది ఉంటారు. ఇంకా అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ఈ సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు. సాధ్యమైనంత త్వర లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.గ్రామ స్థాయి నాయకులతో ఏఐసిసి చీఫ్ ఖర్గే నేరుగా సమావేశం కావడం చరిత్రలో ఇదే తొలిసారి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో ఇ టువంటి సమ్మేళనాలు నిర్వహించడానికి తెలంగాణ ఆదర్శం అవుతుందని ఆయన చెప్పా రు. ఖర్గేతో నేరుగా మాట్లాడేందుకు ఇది చక్కని అవకాశం కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.