- Advertisement -
పశ్చిమ బెంగాల్‌లో సముద్ర తీర విహార పట్టణం దిఘాలో కొత్తగా నిర్మించిన జగన్నాథ్ ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం ప్రారంభోత్సం చేశారు. మూడు సంవత్సరాల్లో ఆలయాన్ని నిర్మించిన కార్మికులు, ఇంజనీర్లకు మమత ధన్యవాదాలు తెలియజేశారు. ‘ఈ ప్రారంభోత్సవం కోసం ఇక్కడికి వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. అన్ని మతాల వారు ఇక్కడి వచ్చారు’ అని ఆమె చెప్పారు. రానున్న సంవత్సరాల్లో ఆలయం ప్రధాన యాత్రా స్థలంగా రూపుదిద్దుకుంటుందని మమత అన్నారు.
- Advertisement -