Monday, September 15, 2025

జగిత్యాలలో విషాద ఘటన.. తమ్ముడికి అంత్యక్రియలు నిర్వహిస్తూ అన్న మృతి..

- Advertisement -
- Advertisement -

తమ్ముడికి అంత్యక్రియలు నిర్వహిస్తూ అన్న మృతి చెందిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మెట్‌పల్లిలో ఒక రోజు వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచివేసింది. నిన్న(శనివారం) గుండెపోటుతో తమ్ముడు శ్రీనివాస్ మృతి చెందాడు.

దీంతో ఆదివారం తమ్ముడు శ్రీనివాస్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తూ అన్న సచిన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. దారి మధ్యలోనే సచిన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వారి కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News