Friday, May 9, 2025

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ విషాద సంఘటన గురువారం బొక్కలోనిపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజేష్(35) తన భార్య సరిత(30)పై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు అనుమానంతో కొంతకాలంగా తరుచూ రాజేష్ గొడవపడేవాడు.

ఈ క్రమంలో నిన్న బంధువుల పెళ్లికి ఇద్దరు కలిసి వెళ్లొచ్చిన తరువాత మరోసారి గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన రాజేష్.. ఇంట్లో ఉన్న గొడ్డలితో తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సరిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తర్వాత రక్తపు మడుగులో మృతిచెందిన భార్యను చూసి భయంతో రైలు కింద పడి రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఒకేసారి చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News