Thursday, September 18, 2025

విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ బిల్డింగ్‌ పై నుంచి పడి వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ బిల్డింగ్‌ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మూటకొండూరు మండలంలోని అమ్మనబోలులో చోటుచేసుకుంది. మంగళవారం సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా భవనంపైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో నరేందర్‌ అనే వ్యక్తి..  బిల్డింగ్‌ పై నుంచి జారిపడి తీవ్ర గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పండుగ వేళ అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News