మన తెలంగాణ/ పెంట్లవెల్లి ః పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ ఖయ్యూం తెలిపిన వివరాల ప్రకారం దేవులాల రాజు(30)కి నర్సాయిపల్లి గ్రామానికి చెందిన జ్యోతితో 10 సంవత్సరాల క్రిందట వివాహమైంది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య జ్యోతి ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఆమె కాపురానికి తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన దేవులాల రాజు ఆదివారం అర్థరాత్రి తన సొంత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు రాజు కుటుంబ సభ్యులు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై ఖయ్యూం తెలిపారు.
భార్య కాపురానికి రావడం లేదని యువకుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -