నల్లగొండ జిల్లాచండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన నిందితుడు తిప్పర్తి యాదయ్య మైనర్ బాలికపై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు తల్లి 2016 డిసెంబర్ 18వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకన్న గౌడ్ తెలిపారు. విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా గురువారం కోర్టు అత్యాచారం కేసుల కోర్టు నిందితున్ని దోషిగా నిర్ధారించి, వివిధ సెక్షన్ల కింద చట్టం ప్రకారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.25 వేల జరిమానా మొత్తం కలిపి 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.35 వేల జారీనామా విధించారు.
బాధితురాలికి రూ.10 లక్షల రూపాయల పరిహారంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాలని తీర్పు వెలువరించిందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రమేష్ కుమార్ సిఐ, భాస్కర్ రెడ్డి యస్.ఐ, ప్రాసిక్యూషన్‌కు సహకరించిన నల్గొండ డిఎస్‌పి, కే శివరాంరెడ్డి, చండూరు సిఐ ఆదిరెడ్డి, యస్.ఐ వెంకన్న,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సిడిఓ రామాంజనేయులు అధికారులు,లీగల్ ఆఫీసర్ భరోసా సెంటర్ కె.కల్పన, పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.