Saturday, July 5, 2025

న్యాయం చేయాలని అర్ధ నగ్నంగా నిరసన

- Advertisement -
- Advertisement -

రెవెన్యూ అధికారుల తీరుపై ఓ బాధితుడు వినూత్న రీతిలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. బాధితుడు గిరిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…తట్టిఅన్నారం సర్వేనం 109లో మూడు ఎకరాలు, 110లో మూడు ఎకరాలు తనకు భూమి ఉందని తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా తన భూమిని రెవెన్యూ అధికారులు తన భూమి ఇతరులకు అప్పగించే కుట్ర చేశారని ఆరోపించారు. దీంతో తన భూమి కోసం న్యాయ పోరాటం సాగిస్తున్నట్లు తెలిపారు.

తన 6 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులో ఎక్కించి పాసు బుక్కులు ఇవ్వాలని కోర్టును అశ్రయిస్తే తనకు అనుకూలంగా కోర్టు ఆదేశించినా న్యాయం జరగటం లేదన్నారు. కొంత మంది రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తన భూ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News