Thursday, July 31, 2025

దొంగతనం చేశాడని.. తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు..

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: హరియాణాలోని గురుగ్రామ్ (Gurugram) నగరంలో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడని నెపంతో ఓ వ్యక్తిని సెక్యూరిటీ గార్డులు తలకిందులుగా వేలాడదీసి చిత్ర హింసలు పెట్టారు. ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో కరెంటు వైర్లు దొంగలించాడని జెసిబి డ్రైవర్ అయిన బాధితుడిని సెక్యూరిటీ గార్డులు హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు పుష్పేంద్ర, అజిత్ సింగ్, కృష్ణ కుమార్, అమిత్ కుమార్‌లుగా గుర్తించారు. బాధితుడికి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యం అందుతోంది. దీనిపై స్పందించిన గురుగ్రామ్ పోలీసులు చట్టానికి ఎవరు అతీతులు కారని.. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News