- Advertisement -
మన తెలంగాణ/పెద్ద కొడప్‌గల్: మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తడకంటి అలియాస్ బుడాల గణేష్ (30) బుధవారం రాత్రి కాస్లాబాద్ గ్రామంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాస్లాబాద్ గ్రామం నుంచి హజ్గుల్ గ్రామానికి ఇల్లరికం వెళ్లాడు. గత 15 రోజుల క్రితం కాస్లాబాద్ గ్రామం తన ఇంటికి వచ్చాడు. మద్యానికి బానిసై మద్యం మత్తులో రాత్రి ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇతనికి ఇద్దరు పిల్లలున్నారని, భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
- Advertisement -